RCB vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఇప్పటి వరకూ ఖాతా తెరవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కీలక మ్యాచ్‌లో విఫలం అయింది. శుభారంభం దక్కినా భారీ స్కోర్ చేయలేకపోయింది. యూపీ వారియర్స్ బౌలర్లు చెలరేగడంతో 138 పరుగులకే ఆలౌట్ అయింది. (Elysse Perry) ఎలిసే పెర్రీ (52) హాఫ్ సెంచరీతో జట్టను ఆదుకుంది. (Sophie Devine) సోఫీ డెవినే (36) ధాటిగా ఆడిన ఎక్కువ సేపు నిలవలేకపోయింది.
చివర్లో ఎరిన్ బర్న్స్ (12) ఒక్కామె మాత్రమే ధాటిగా ఆడింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన శ్రేయాంక పాటిల్ (15) విఫలం అయింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ నాలుగు, దీప్తి శర్మ మూడు వికెట్లు తీశారు. రాజేశ్వరీ గైక్వాడ్ ఒక వికెట్ పడగొట్టింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించింది. ఓపెనర్ సోఫీ డెవినే ఫోర్లతో యూపీ వారియర్స్ బౌలర్లపై విరుచుకు పడింది. దాంతో 3 ఓవర్లకే ఆ జట్టు 29 రన్స్ చేసింది.. అయితే.. నాలుగో ఓవర్లో షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ (Smriti Mandhana) స్మృతి మంధాన (4)ను రాజేశ్వరీ గైక్వాడ్ ఔట్ చేసింది. దాంతో, 29 రన్స్ వద్ద ఆ జట్టు తొలి వికెట్ పడింది. మరో ఓపెనర్ సోఫీ డెవినే (32), ఎలిసా పెర్రీ (21)తో కలిసి ధాటిగా ఆడంది. వీళ్లు రెండో వికెట్‌కు 45 రన్స్ జోడించారు. సోఫీని బౌల్డ్ చేసిన ఎక్లెస్టోన్ ఈ జోడీని విడదీసింది.116 రన్స్ వద్ద పెర్రీ ఐదో వికెట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన కనికా ఆహుజా (8), హీథర్ నైట్ (2) తక్కువ రన్స్‌కే పెవిలియన్ చేరారు. దాంతో, ఆ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది.