మక్తల్, మార్చి 19 : ఢిల్లీలో జరుగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఖోఖో టోర్నీలో పాల్గొనే తెలంగాణ మహిళా జట్టు కెప్టెన్గా రూప వ్యవహరించనుంది. ఈ విషయాన్ని నారాయణపేట జిల్లా కర్ని జెడ్పిహెచ్ఎస్ జీహెచ్ఎం వెంకటయ్యగౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్ని పాఠశాలలో ప్రస్తుతం ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న రూప..ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో బరిలోకి దిగనుంది. విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రూప..కెప్టెన్గా ఎంపిక కావడంపై ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.