Cristiano Ronaldo : ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అరుదైన ఘనత సాధించాడు. సౌదీ ప్రో లీగ్స్(Soudi Pro League)లో టాప్ గోల్ స్కోరర్‌గా రికార్డు సృష్టించాడు. అల్ నస్రీ(Al Nassr) క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో మే 27న అల్ ఇతిహద్ జట్టుపై రెండు గోల్స్ కొట్టాడు. దాంతో, సౌదీ ప్రో లీగ్ ఒకే సీజన్లో అత్యధిక గోల్స్ బాదిన ఫుట్‌బాలర్‌గా చరిత్రపుటల్లోకెక్కాడు. ఈ సీజన్లో ఈ ఫార్వర్డ్ ప్లేయర్ రికార్డు స్థాయిలో 35 సార్లు బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.
తద్వారా 34 గోల్స్‌తో అబ్దెరజాక్ హమ్మదిల్లా పేరిట ఉన్న రికార్డును రొనాల్డో బద్ధలు కొట్టేశాడు. అంతేకాదు నాలుగు దేశాల్లోని లీగ్స్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఏకైక ఆటగాడిగా 39 ఏండ్ల మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. పోర్చుగల్ కెప్టెన్ అయిన రొనాల్డో ఇంతకుముందు ప్రీమియర్ లీగ్(Premier League), లా లిగా(La Liga), సెరీ ఏ(SerieA) తరఫున అత్యధిక గోల్స్ వీరుడిగా నిలిచాడు.
CR7 BRACE!! 💪
Record. Broken. 35 goals in RSL play and 50 in all competitions this year for Cristiano Ronaldo 👏👏 pic.twitter.com/uPD05MkzSk
— FOX Soccer (@FOXSoccer) May 27, 2024
ప్రపంచంలోని మేటి ఫుట్‌బాలర్లలో ఒకడైన రొనాల్డో 2022 ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) తర్వాత అల్ నస్రీ క్లబ్‌కు మారాడు. అప్పటి నుంచి ఆ క్లబ్ రాతే మారిపోయింది. సౌదీ ప్రో లీగ్‌లో రొనాల్డో కెప్టెన్సీలో ఆడిన అల్ నస్రీ క్లబ్ విజయాల బాట పట్టింది. తాజాగా ఒకే సీజన్లో 35 గోల్స్‌తో రొనాల్డో చరిత్రను తిరగరాశాడు. ప్రస్తుతం ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడి ఖాతాలో 893 గోల్స్ ఉన్నాయి. మరో 7 గోల్స్ కనుక సాధిస్తే.. కెరీర్లో 900 గోల్స్ సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా రొనాల్డో రికార్డు సృష్టిస్తాడు.