Cristiano Ronaldo : సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఆట ఓ రేంజ్లో ఉంటుందని తెలిసిందే. మైదానంలోకి దిగాడంటే ఈ ఫార్వర్డ్ ప్లేయర్ మెరుపు వేగంతో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఈసారి కూడా అలాంటి మెరుపు గోల్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడీ ఫుట్‌బాల్ స్టార్. అల్ నస్రీ (Al Nassr) తరపున హ్యాట్రిక్ గోల్ కొట్టాడు రొనాల్డో. అంతే.. అభిమానులు పూనకం వచ్చిన వాళ్లలా రొనాల్డో.. రొనాల్డో.. అంటూ ఊగిపోయారనుకో.
మూడేళ్ల క్రితం సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్రీకి మారిన రొనాల్డో సంచలన ఆటతో అదరగొడుతున్నాడు. సౌదీ ప్రో లీగ్‌లో దుమ్మురేపిన ఈ స్టార్ ప్లేయర్ గురువారం రియో అవే (Rio Ave) జట్టుపై చెలరేగాడు. తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ.. బుల్లెట్లా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడి చేస్తూ వరుసగా మూడు గోల్స్ చేశాడు. పెనాల్టీ కార్నర్‌ను రెప్పపాటులోనే గోల్ పోస్ట్ లోకి పంపి హ్యాట్రిక్ సాధించాడు. ఈ సాకర్ మాంత్రికుడు వరుసపెట్టి గోల్స్ వర్షం కురిపిస్తుంటే అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం రొనాల్డో హ్యాట్రిక్ గోల్ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇంకెందుకాలస్యం మీరూ చూసేయండి.
Cristiano Ronaldo hat trick today against Rio Ave #CristianoRonaldo #AlNassr pic.twitter.com/s1WD9csGYu
— Robert Hala Madrid🇵🇹 (@RobertRMCF) August 7, 2025
ఖతార్ 2022లో ఆతిథ్యమిచ్చిన ఫిఫా వరల్డ్ కప్ అనంతరం రొనాల్డోను అల్ నస్రీ క్లబ్ రికార్డు ధరకు దక్కించుకుంది. తన పేరుతోనే కాదు ఆటతోనూ అల్ నస్రీ రాతను మార్చేశాడీ ఫార్వర్డ్ ప్లేయర్. దాంతో, మొదట అతడితో రెండున్నరేళ్లకు ఒప్పందం చేసుకున్ను అల్ నస్రీ యాజమాన్యం.. ఈమధ్యే అతడి కాంట్రాక్ట్‌ను మరో రెండేళ్లు అంటే 2027 వరకూ పొడిగించింది. ఇప్పటివరకూ రొనాల్డో ఈ క్లబ్ తరఫున 93 గోల్స్ కొట్టాడు.