IND vs RSA : తొలి ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగిన దక్షిణాఫ్రికా పేసర్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ(0)ను రబాడ డకౌట్ చేయగా.. కుర్రాడు యశస్వీ జైస్వాల్(5)ను బర్గర్ సూపర్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. దాంతో, తొలి టెస్టులో భారత జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. రబాడ, అరంగేట్రం పేసర్ బర్గర్ ధాటికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
And Burger gets Jaiswal – India rocked early! #SAvIND
Tune in ⤵️
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
దాంతో, ఇక భారమంతా శుభ్‌మన్ గిల్(13), విరాట్ కోహ్లీ(0)లపై పడింది. వీళ్లిద్దరూ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. టీమిండియా ఈ మ్యాచ్‌లో సఫారీల కంటే 144 పరగులు వెనకబడి ఉంది. తద్వారా సెంచూరియన్‌లో సఫారీలను 408 పరుగులకే కట్టడి చేశామన్న ఆనందం లేకుండా పోయింది.