Rohit Sharma: మోర్గన్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ..
Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక సంఖ్యలో సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గన్ 2019 టోర్నీలో అత్యధికంగా 22 సిక్సర్లు కొట్టగా.. తాజాగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
బెంగుళూరు: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక సంఖ్యలో సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గన్ 2019 టోర్నీలో అత్యధికంగా 22 సిక్సర్లు కొట్టగా.. తాజాగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే 23 సిక్సర్లు బాదేశాడు. దీంతో అతను మోర్గన్ రికార్డును బ్రేక్ చేసేశాడు.
బెంగుళూరులో నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్.. సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో నాలుగవ సారి అతను 50 కన్నా ఎక్కువ రన్స్ చేశాడు.
వరల్డ్‌కప్‌లో కెప్టెన్లుగా అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లతో రోహిత్, మోర్గన్ తర్వాత ఏబీ డివిలీర్స్, ఆరన్ ఫించ్, మెకల్లమ్ ఉన్నారు. డివిలీర్స్ 2015లో 21 సిక్సులు, 2019లో ఆరన్ ఫించ్ 18 సిక్సులు, 2015లో మెకల్లమ్ 17 సిక్సర్లు కొట్టారు.
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలీర్స్ ఖాతాలో ఉన్న వన్డే సిక్సర్ల రికార్డును కూడా రోహిత్ బ్రేక్ చేశాడు. ఒకే ఏడాది ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. 2015లో డివిలీర్స్ 58 సిక్సర్లు కొట్టాడు. అయితే ఈ ఏడాది రోహిత్ ఇప్పటికే 60 సిక్సర్లు కొట్టేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

