Rohit Sharma | రోహిత్ శర్మ బామ్మర్ది మామూలోడు కాదుగా.. కోహ్లీ, విజయ్ దేవరకొండతో సహా చాలామంది క్రికెటర్లు, యాక్టర్లతో వ్యాపారాలు
Rohit Sharma | విరాట్ కోహ్లీ.. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఖరీదైన ప్లేయర్. తాను పట్టిందల్లా బంగారం అన్నట్లు ప్రముఖ కంపెనీల ఒప్పందాలతో కోహ్లీ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాడు. సరాసరిన ఎవరూ ఊహించని రీతిలో విరాట్ రూ.1050 కోట్ల విలువైన మొత్తాన్ని వివిధ కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నాడు.
Rohit Sharma | విరాట్ కోహ్లీ.. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఖరీదైన ప్లేయర్. తాను పట్టిందల్లా బంగారం అన్నట్లు ప్రముఖ కంపెనీల ఒప్పందాలతో కోహ్లీ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాడు. సరాసరిన ఎవరూ ఊహించని రీతిలో విరాట్ రూ.1050 కోట్ల విలువైన మొత్తాన్ని వివిధ కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నాడు. మరోవైపు యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ తానేం తక్కువ కాదన్నట్లు వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కోట్లు ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇలా హవా నడిచినప్పుడే డీల్స్‌తో దుమ్మురేపుతున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది.. వీరి వ్యాపార కార్యకలాపాల వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే ఆశ్చర్య పోవడం మీ వంతు అవుతుంది. ఇంతకీ వాళ్ల వెనుక ఉన్నది ఎవరని అనుకుంటున్నారా? ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బామ్మర్ది బంటీ సజ్దె.
కెప్టెన్ రోహిత్‌శర్మ బామ్మర్ది బంటీ సజ్దె ప్రముఖ వ్యాపారవేత్త. ముంబై పారిశ్రామిక వర్గాల్లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. కార్నర్‌స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్‌నైట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా క్రికెటర్లు, సినీ యాక్టర్లతో వ్యాపారం చేస్తున్నాడు. రోహిత్‌శర్మ భార్య రితికా సజ్దేకు బంటీ సజ్దే సోదరుడు. బంటీకి అటు భారత క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌లోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. కార్నర్‌స్టోన్ కంపెనీ ద్వారా కోహ్లీ.. ప్రముఖ కంపెనీలు ఎంఆర్ఎఫ్, మింత్రా, సింథాల్, వివో, టిస్సాట్ లాంటి వాటితో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వీటితో ఎండార్స్మెంట్ల ద్వారా కోహ్లీ రోజుకు ఏడు నుంచి 10 కోట్ల వరకు ఆర్జిస్తున్నాడు. ఇది కోహ్లీ వరకే పరిమితం కాలేదు. కెప్టెన్ రోహిత్‌శర్మ, శిఖర ధవన్, కేఎల్ రాహుల్ ఇలా చాలా మంది క్రికెటర్లు బంటీతో కలిసి తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్‌తో జతకట్టిన బంటీ.. అనన్య పాండే, షనాయ కపూర్, విజయ్ దేవరకొండంతో కలిసి భారీ డీల్స్ చేస్తున్నాడు. ప్రముఖులతో కోట్లాది రూపాయల డీల్స్ చేస్తున్న బంటీని ఈ మధ్యే సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణకు హాజరయ్యాడు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తితో కలిసి బంటీ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఏదీ ఏమైనా కోహ్లీ, రాహుల్ లాంటి స్టార్ క్రికెటర్ల కోట్ల రూపాయల వ్యవహారాలన్నీ రోహిత్‌శర్మ బామ్మర్ది చక్కదిద్దుతున్నాడు.
Read More :
SatwikSairaj | ఫార్ములా వన్ కార్ కంటే ఫాస్ట్‌గా స్మాష్.. గిన్నిస్ రికార్డుకెక్కిన సాత్విక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

