IPL Franchises | కొత్త హెడ్‌కోచ్ వేటలో హైదరాబాద్, రాజస్థాన్.. ఆ ఇద్దరికీ ఆర్సీబీ గుడ్ బై చెప్పనుందా..?
IPL Franchises : ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొత్త కోచ్‌ల వేటలో పడ్డాయి. ఆటగాళ్లతో పాటు కోచ్‌లను మారిస్తేనే పదిహేడో సీజన్(IPL 17th Season)లో తమ జట్ల ఆట మెరుగవుతుందని నమ్మడమే అందుకు కారణం. ఈమధ్యే లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టు హెడ్‌కోచ్‌గా జస్టిన్ లాంగర్(Justin Langer)కు బాధ్యతలు అప్పగించింది. దాంతో, సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కూడా...
IPL Franchises : ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొత్త కోచ్‌ల వేటలో పడ్డాయి. ఆటగాళ్లతో పాటు కోచ్‌లను మారిస్తేనే పదిహేడో సీజన్(IPL 17th Season)లో తమ జట్ల ఆట మెరుగవుతుందని నమ్మడమే అందుకు కారణం. ఈమధ్యే లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టు హెడ్‌కోచ్‌గా జస్టిన్ లాంగర్(Justin Langer)కు బాధ్యతలు అప్పగించింది. దాంతో, సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కూడా కొత్త కోచ్ కోసం వేట మొదలు పెట్టాయి.
వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా(Brian Lara) స్థానంలో మరొకరిని తీసుకోవాలని ఆరెంజ్ ఆర్మీ యాజమాన్యం అనుకుంటోంది. దాంతో, లారా కూడా ఫ్రాంచైజీతో అంటీముట్టనట్టు ఉంటున్నాడట. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం, కోచ్‌గా మెరుగైన రికార్డు ఉన్నవాళ్ల కోసం హైదరాబాద్ చూస్తోంది.
ఆండీ ఫ్లవర్, జస్టిన్ లాంగర్

ఫ్లవర్‌తో రాజస్థాన్ చర్చలు
మరోవైపు.. లక్నో వదులుకున్న ఆండీ ఫ్లవర్(Andy Flower)తో రాజస్థాన్ యాజమాన్యం ఇప్పటికే చర్చలు జరుపుతోంది కూడా. అన్నీ కుదరితే ఫ్లవర్ రాజస్థాన్ కోచ్‌గా రావడం ఖాయం. అయితే.. అతడి రాకతో ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న కుమార సంగక్కర(kumar sangakkara) పదవికి ఏమాత్రం ప్రమాదం లేదని ఫ్రాంచైజీ చెప్తోంది. ఇప్పటివరకూ ఐపీఎల్ ట్రోఫీ అందుకోని ఆర్సీబీ కూడా హెడ్‌కోచ్ సంజయ్ బంగర్(Sanjay Bangar), టీమ్ డైరెక్టర్ మైక్ హసన్(Mike Hesson)లను మార్చనుందనే వార్తలు వినిపించాయి.
మైక్ హసన్, సంజయ్ బంగర్

కానీ, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఆగస్టు 31తో హసన్, డిసెంబర్ 31తో బంగర్ కాంట్రాక్ట్ ముగియనుంది. దాంతో, ఆ లోపు వీళ్లపై యాజమాన్యం ఒక నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తోంది. పదహారో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఉత్కంఠ రేపిన ఫైనల్లో రవీంద్ర జడేజా(11 నాటౌట్) చెన్నైని గెలిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టడంతో చెన్నై ఐదోసారి ఐపీఎల్ విజేతగా అవతరించింది.
ఇవి కూడా చదవండి
PV Sindhu | వరుస వైఫల్యాల ఎఫెక్ట్.. టాప్ 10 నుంచి సింధు ఔట్
Saud Shakeel | ఆరో టెస్టులోనే అరుదైన ఫీట్.. శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ కొట్టిన పాక్ ప్లేయర్‌గా రికార్డు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

