PV Sindhu | వరుస వైఫల్యాల ఎఫెక్ట్.. టాప్ 10 నుంచి సింధు ఔట్
PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) ఈ ఏడాది టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన ఆమె వరుస టోర్నీల్లో విఫలమవుతూ నిరాశపరుస్తోంది. దాంతో, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాకింగ్స్(BWF World Rankings)లో 17వ స్థానానికి పరిమితమైంది. గత దశాబ్ద కాలంలో...
PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) ఈ ఏడాది టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన ఆమె వరుస టోర్నీల్లో విఫలమవుతూ నిరాశపరుస్తోంది. దాంతో, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాకింగ్స్(BWF World Rankings)లో 17వ స్థానానికి పరిమితమైంది. గత దశాబ్ద కాలంలో ఈ తెలుగమ్మాయికి ఇదే అత్యల్ప ర్యాంక్ కావడం గమనార్హం. నిరుడు బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో(Commonwealth Games 2022) స్వర్ణం నెగ్గిన సింధు అనంతరం మరో మేజర్ టైటిల్ నెగ్గలేకపోయింది.
2013 జనవరిలో 17వ ర్యాంక్‌లో నిలిచిన సింధు.. ఆ తర్వాత నిలకడగా రాణించి తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. 2016 ఏప్రిల్‌లో సింధు కెరీర్లో అత్యుత్తమంగా రెండో ర్యాంక్ కు చేరుకుంది. అప్పటి నుంచి నిరుటి వరకు ఈ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ టాప్-10లో కొనసాగింది. గత కొంత కాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పది కంటే తక్కువ ర్యాంక్‌కు పడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్(HS Pranay) అత్యుత్తమంగా 10 ర్యాంక్‌లో ఉండగా.. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఒలింపిక్ మెడల్‌తో సింధు

కామన్వెల్త్ క్రీడల అనంతరం గాయం కారణంగా సింధు దాదాపు 5 నెలల పాటు ఆటకి దూరమైంది. కోలుకుని బరిలోకి దిగిన ఆమె మునుపటి జోరు కనబర్చలేకపోతోంది. గత 14 టోర్నీల్లో కలిపి సింధు 49,480 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) జరుగనున్న నేపథ్యంలో సత్తా చాటుతానని సింధు ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సీజన్లో మ్యాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ ఫైనల్‌కు చేరడమే సింధు అత్యుత్తమ ప్రదర్శన. ఆతర్వాత ఆడిన ఆన్నీ టోర్నీల్లోనూ సెమీస్ అడ్డంకిని దాట లేకపోయింది. యూఎస్ ఓపెన్, కెనడా ఓపెన్లలో సింధు క్వార్టర్ ఫైనల్లో ఓడింది. ప్రస్తుతం కొరియా ఓపెన్ బరిలో ఉన్న సింధు ఈ సారైనా మెరుగైన ఆటతీరు కనబరుస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి
Saud Shakeel | ఆరో టెస్టులోనే అరుదైన ఫీట్.. శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ కొట్టిన పాక్ ప్లేయర్‌గా రికార్డు
Asian Games 2023 | ఆ ఇద్దరు రెజ్లర్లకు ఊరట.. ట్రయల్స్ లేకుండానే ఆసియా గేమ్స్‌లో ఆడేందుకు అనుమతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

