Rohit Sharma : భారత సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డేల్లో మరో మైలురాయిని అధిగమించాడు. ఇటీవలే వన్డేల్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా అవతరించిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు అంతర్జాతీయంగా 20 వేల క్లబ్లో చేరాడు. వైజాగ్ వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. కేశవ్ మహరాజ్ ఓవర్లో సింగిల్ తీసిన రోహిత్.. మూడు ఫార్మాట్లలో కలిపి 20 వేల పరుగులు సాధించాడు. మొత్తంగా ఈ ఘనతను సొంతం చేసుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా ఈ మాజీ కెప్టెన్ రికార్డు నెలకొల్పాడు.
వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ వరుస పెట్టి రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో సిక్సర్ల కింగ్‌గా షాహిద్ అఫ్రిదిని దాటేసి చరిత్ర సృష్టించిన రోహిత్.. ఈసారి అంతర్జాతీయంగా 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లలో ఈ రికార్డు నెలకొల్పిన వారిలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అగ్రస్థానంలో ఉన్నాడు.
Mt. 2⃣0⃣k ⛰️
Congratulations to Rohit Sharma on becoming just the 4th Indian cricketer to amass 2⃣0⃣,0⃣0⃣0⃣ runs in international cricket 🫡
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/S3nRb8ve5w
— BCCI (@BCCI) December 6, 2025
దిగ్గజ ఆటగాడైన సచిన్ ఖాతాలో 34357 రన్స్ ఉన్నాయి. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ 27,910 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. రన్ మెసీన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. సఫారీలపై రాంచీ, రాయ్‌పూర్ వన్డేల్లో సెంచరీలతో కదం తొక్కిన విరాట్ పేరిట మూడు ఫార్మాట్లలో 24,208 పరుగులు ఉన్నాయి. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 18,433 రన్స్‌తో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. దిగ్గజ ఆటగాడైన రోహిత్.. టెస్టుల్లో 4,301, టీ20ల్లో 4,231 పరుగులు కొట్టాడు. వన్డేల్లో 11వేలకుపైగా రన్స్ హిట్‌మ్యాన్ ఖాతాలో ఉన్నాయి.
20,000 International runs for Hitman @ImRo45 🔥
ODIs – 11468*
Tests – 4301
T20Is – 4231
Total – 20,000 ❤️🔥4th player to score 20k international runs for India!. pic.twitter.com/fhLPDtfQZL
— Rohit Sharma Trends (@TrendsRohit) December 6, 2025
20k international cricket runs is no joke. Put some respect on Rohit Sharma’s name. pic.twitter.com/lwAor8Iqo8
— R A T N I S H (@LoyalSachinFan) December 6, 2025