చెన్నై: సుమారు ఆరు నెలల విరామం తర్వాత సొంతగడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా తడబడింది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలో తొలి టెస్ట్ (Chennai Test) ఆడుతున్న భారత్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. యశస్వీ జైస్వాలత్తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మతో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఆరు పరుగులే చేసిన హిట్‌మ్యాన్.. హస్న్ మహమూద్ బౌలింగ్‌లో సెకండ్ స్లిప్‌లో ఉన్న షాంటోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన శుభ్‌మన్ గిల్ తన ఫామ్‌లేమిని మారోసారి చాటుకున్నాడు. ఎనిమిది బందులు ఎదుర్కొన్న గిల్.. ఖాతా తెరువకుండానే వెనుతిరిగాడు. హసన్ మహమూద్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ రోహిత్‌నే అనుసరించాడు.
ఇక కింగ్ కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. 6 బాల్స్‌లో 6 రన్స్ చేసిన కోహ్లీ.. హసన్ బౌలింగ్‌లోనే లిట్టన్ దాస్‌కు క్యాచ్ సమర్పించుకున్నాడు. కాగా, టాపార్డర్ కుప్పకూలినా జైస్వాల్ (45 బంతుల్లో 28) మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. పత్తో (22 బాల్స్‌లో 14) కలిసి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం 16.3 ఓవర్లకుగాను భారత్ 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది.