Rocky Flintoff | ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ ఫ్రొఫెషనల్ క్రికెట్లో ఆడిన రెండో మ్యాచ్లోనే సత్తా చాటాడు. 16 ఏండ్ల ఈ కుర్రాడు.. స్వదేశంలో శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన రెండో టెస్టు (అనధికారిక)లో సెంచరీ (101) తో చెలరేగాడు. ఫ్లింటాఫ్ చేతి నుంచి క్యాప్ అందుకున్న రాకీ.. తండ్రి మాదిరిగానే మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చి తన జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తండ్రి స్టాండ్స్ నుంచి మ్యాచ్ చూస్తుండగా శతకం బాది ఇంగ్లండ్ సీనియర్ జట్టులో చోటు కోసం వేట మొదలుపెట్టాడు.
చల్తెన్హమ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భాగంగా ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రాకీ.. 181 బంతులు ఆడి 9 బౌండరీలు, 2 భారీ సిక్సర్లతో శతకాన్ని పూర్తిచేశాడు. తద్వారా ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ చరిత్రలో అతి పిన్నవయసులో శతకం చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఫ్లింటాఫ్ సెంచరీకి తోడు కెప్టెన్ హమ్జా షేక్ సైతం సెంచరీతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 477 పరుగుల భారీ స్కోరు చేసింది.
Another England U19s century for Rocky Flintoff against Sri Lanka! 👏🏴
106 runs off 181 balls, with 9 fours and 2 sixes! Here is the best of Rocky’s knock! 🎥👇
🌹 #RedRoseTogether pic.twitter.com/eEl60ERQI9
— Lancashire Lightning (@lancscricket) July 18, 2024
ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకే ఆలౌట్ అయింది. గయనా వీరసింఘె (77) రాణించగా మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్లో సైతం ఆ జట్టు 271 పరుగులకే ఆలౌట్ అయి ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
One proud father as Rocky Flintoff made his Under-19 Test debut for England today 🏴 pic.twitter.com/md91PvdZCr
— ESPNcricinfo (@ESPNcricinfo) July 8, 2024