ముంబై: భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్‌సింగ్ అర్ధాంతరంగా క్రికెట్ కెరీర్‌ను ముగించేందుకు కోహ్లీ కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం ఊతప్ప మాట్లాడుతూ పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న యువీ దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించాడు.
క్యాన్సర్‌ను దిగ్విజయంగా జయించి తిరిగి క్రికెట్లోకి అడుగుపెట్టాను. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ నిర్దేశించిన కొన్ని ఫిట్నెస్ నిబంధనలు యువీ కెరీర్ ముగిసేందుకు కారణమయ్యాయి. సడలింపులు ఇవ్వాల్సి ఉన్నా.. వెనుకకు తగ్గకపోవడంతో యువీకి జట్టులో చోటుదక్కలేదు’ అని అన్నాడు.