అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం రాత్రి
ఆసక్తికరపోరు జరగనుంది. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్లో వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న కోహ్లీసేనకు గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది.
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సూపర్ ఓవర్లో గెలిచిన ఢిల్లీ హ్యాట్రిక్ విజయాలతో
జోష్‌లో ఉంది. చెన్నై చేతిలో ఘోరంగా ఓడిపోయిన కోహ్లీసేన గట్టిగా పుంజుకోవాలని భావిస్తోంది. రెండు జట్లు అన్ని విభాగాల్లో బలంగా ఉండటంతో పోరు రసవత్తరంగా సాగనుంది.
చెరో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇరుజట్లు పాయింట్ల పట్టికలో వరుసగా ఢిల్లీ (రెండు),
బెంగళూరు(మూడు) స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు లీగ్‌లో 26 సార్లు తలపడగా..బెంగళూరు 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేల లేదు. గెలుపోటములే కాదు.. భారీ స్కోర్ల విషయంలోనూ ఢిల్లీపై బెంగళూరుదే పూర్తి ఆధిపత్యం.
Smiles that brighten our day. 🤩😇#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/nNyG1zY659
— Royal Challengers Bangalore (@RCBTweets) April 27, 2021
As our DC boys get ready to roar tonight, Swipe ◀️ to know how COVID-19 survivors can help donate Plasma to those in need, through our joint initiative with @FeverFMOfficial – #ProjectPlasma 💙
— Delhi Capitals (@DelhiCapitals) April 27, 2021
Share this to help spread the word 🤝🏽#YehHaiNayiDilli #IPL2021 #DCvRCB pic.twitter.com/WAdKcLHQX8
Ready for a '𝗥𝗼𝘆𝗮𝗹' Rumble at the world's largest cricket stadium 🔥🏟️#YehHaiNayiDilli #IPL2021 #DCvRCB @MStoinis @Gmaxi_32 pic.twitter.com/3jGEFVsyBZ
— Delhi Capitals (@DelhiCapitals) April 27, 2021