టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతని బ్యాటింగ్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పంత్ బ్యాటింగ్ విన్యాసాలు అతన్ని స్టార్ ఆటగాడిగా మార్చాయి. గబ్బాలో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు 138 బంతులు ఎదుర్కొన్న పంత్.. 89 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (క్రికెట్ ఆస్ట్రేలియా)కు భారీ డీల్ లభించిందట. ఇండియన్ మార్కెట్లో ప్రసార హక్కులను డిస్నీ స్టార్ ఏకంగా 250 మిలియన్ డాలర్లకు (అంటే సుమారు రూ.2 వేల కోట్లు) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పంత్ ఇన్నింగ్స్ చాలా మంది మనసుల్లో ఫ్రెష్‌గానే ఉంది. అందుకే క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇంత భారీ డీల్ దక్కినట్లు కొందరు విశ్లేషకులు చెప్తున్నారు.