Rishabh Pant | పంత్ అరుదైన ఘనత.. ఆసియాలోనే తొలి వికెట్ కీపర్‌గా గుర్తింపు
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచులో పంత్ సెంచరీ చేయడం ద్వారా ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ లో కూడా సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు.
ఇంగ్లండ్ తో కొద్దిరోజుల క్రితమే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో పంత్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 90 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన దశలో రవీంద్ర జడేజా తో కలిసి రెండు వందలకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు పంత్. ఇక ఆదివారం నాటి వన్డేలో కూడా 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో హార్ధిక్ పాండ్యాతో కలిసి 133 పరుగులు జోడించాడు. ఫలితంగా భారత్ మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా చేజిక్కించుకుంది. ఈ రెండు సందర్భాలలో భారత్ కు అవసరమున్న సమయంలోనే పంత్ సెంచరీలతో చెలరేగడం విశేషం.
ఇంగ్లండ్ పై టెస్టులతో పాటు వన్డేలలో కూడా సెంచరీలు చేసిన జాబితాలో గతంలో శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర కూడా ఉన్నాడు. సంగక్కర టెస్టులలో ఇంగ్లండ్ పై రెండు సెంచరీలు, రెండు వన్డే శతకాలు బాదాడు. కానీ టెస్టులలో అతడు సెంచరీలు చేసినప్పుడు ప్రసన్న జయవర్దెనే వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో టెస్టులలో అతడు చేసిన సెంచరీలు కేవలం ఆటగాడిగా చేసినట్టుగానే నమోదయ్యాయి.
ఇదిలాఉండగా తన తొలి వన్డే సెంచరీ చేసిన పంత్ ఆదివారం నాటి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ ఇన్నింగ్స్ ను నా జీవితాంతం గుర్తుంచుకుంటా. వన్డేలలో ఇదే నా తొలి సెంచరీ. అదీ జట్టు కష్టాలలో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం వల్ల వచ్చే కిక్ వేరేగా ఉంటుంది..’ అని అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ENG vs IND
- Rishabh Pant
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

