అలీఘడ్: క్రికెటర్ రింకూ సింగ్(Rinku Singh) తన తండ్రికి స్పోర్ట్స్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఆ క్రికెటర్‌పై సోషల్ మీడియాలో ప్రశసంలు కురుస్తున్నాయి. టాప్ క్రికెటర్‌గా మారకముందు.. రింకూ ఫ్యామిలీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్‌తో రింకూ ఇప్పుడు ఓ మేటి క్రికెటర్‌గా మారాడు. ఇండియా తరపున అతను ఆడుతున్నాడు. తండ్రి ఖాన్చంద్ సింగ్‌కు అతను కవాసాకి నింజా స్పోర్ట్స్ బైక్‌ను బహుమతి ఇచ్చాడు.
రింకూ తండ్రి వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తుంటాడు. ఇప్పుడు కొడుకు పెద్ద క్రికెటర్ అయినా.. కాన్చంద్ మాత్రం తన పని వదలలేదు. కవాసాకి నింజా స్పోర్ట్స్ బైక్‌తో రింకూ తండ్రి అలీఘడ్‌లో చక్కర్లు కొడుతున్నాడు. ఆ సిటీలోని చిన్న చిన్న వీధుల్లో అతను కవాసాకి నింజా బైక్‌ను రైడ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను అప్లోడ్ చేశారు.
మరో వైపు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను.. క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరికి పెళ్లి సెట్ అయ్యింది. కానీ ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదు. ఎంగేజ్మెంట్తో పాటు పెళ్లి డేట్ త్వరలో ప్రకటించనున్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల తర్వాత రింకూ, ప్రియా పెళ్లి జరుగుతుందని తుఫానీ సరోజ్ వెల్లడించారు.