బజార్హత్నూర్: ఐపీఎల్( IPL ) 18వ సీజన్లో చాంపియన్స్ ట్రోపీ ఆర్సీబీ( RCB ) గెలిచినందుకు గాను ఓ యువకుడు వెయ్యి మందికి అన్నదానం( Annadanam ) చేసి అభిమానాన్ని చాటుకున్నాడు. బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన కొంగర్ల పటాస్ ప్రశీత్ అనే యువకుడు క్రికెట్ అభిమాని. అందులో విరాట్ కోహ్లికి, ఆర్సీబీకి వీరాభిమాని. ఈ సారైనా ఆర్సీబీ కప్ గెలువాలని కోరుతూ గ్రామంలో అన్నదానం చేపట్టాడు.
తిరుపతి, శబరిమలై, శ్రీకాళహస్తి, శ్రీశైలం ఆలయాలకు వెళ్లి ఆర్సీబీ విజయం సాధించాలని మొక్కుకున్నాడు. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 6 రన్స్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అన్నదానం కార్యక్రమంలో యువకులు లక్ష్మణ్, సంతోష్, సాయి, రాము, పవన్, శేఖర్, సుకుమార్, హరి తదితరులు పాల్గొన్నారు.