RCB vs DC : ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు వెంట వెంటనే ఔటయ్యారు. హీథర్ నైట్ బౌలింగ్లో మేగ్ లానింగ్ (72), షఫాలీ వర్మ (84) ఔట్ అయ్యారు. మొదట లానింగ్ బౌల్డ్ కావడంతో, 162 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో, ఆర్సీబీ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత షఫాలీ కూడా క్యాచ్ అవుట్ అయింది. వీళ్లిద్దరూ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఎడాపెడా బౌండరీలు బాదారు. దాంతో, ఈ లీగ్లో తొలి వికెట్కు భారీ భాగస్వామ్యం నిర్మించారు. జెమీమా రోడ్రిగ్స్ (3), మరిజానే కాప్ కాప్ (6) క్రీజులో ఉన్నారు.