చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నైకి రుతురాజ్ (28), కాన్వే (56) అద్భుతమైన ఆరంభం అందించారు. అయితే పవర్‌ప్లే ముగిసిన తర్వాత చెన్నై బ్యాటింగ్ కుప్పకూలింది.
రాబిన్ ఊతప్ప (1), అంబటి రాయుడు (10) పూర్తిగా నిరాశపరిచారు. చివర్లో మొయీన్ అలీ (34) కొంత పోరాడినా ఫలితం లేకపోయింది. చివర్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న జడేజా (3), ధోనీ (2) విఫలమయ్యారు. డ్వెయిన్ ప్రిటోరియన్ (13) రెండు బౌండరీలు బాదినా.. చెన్నైను విజయానికి చేరువ చేయలేపోయాడు. చివరి ఓవర్ రెండో బంతికి పెవిలియన్ చేరాడు.
సిమర్జీత్ సింగ్ (2 నాటౌట్), మహీష్ తీక్షణ (7 నాటౌట్) క్రీజులో ఉన్నప్పటికీ.. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 13 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు తీయగా.. హసరంగ, హాజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
#RCB win by 13 runs and are now ranked 4 in the #TATAIPL Points Table.
Scorecard – https://t.co/qWmBC0lKHS #RCBvCSK pic.twitter.com/w87wAiICOa
— IndianPremierLeague (@IPL) May 4, 2022