కోహ్లీ సారథ్యంలోని ఐపీఎల్ 14 జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న 31 వ మ్యాచ్‌లో 92 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కోల్‌కతాకు 93 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ అబుదబీలోని జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన కోహ్లీ సేన.. తొలుత బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగినా.. ఆర్సీబీ ప్లేయర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు.
బెంగళూరును దేవ్‌దత్త్ మాత్రం ఆదుకున్నాడు. 20 బంతుల్లో 22 పరుగులు చేశాడు. శ్రీకర్ భరత్ 19 బంతుల్లో 16 పరుగులు చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 4 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. మరో ఆటగాడు హర్షల్ పటేల్ 10 బంతుల్లో 12 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ ఒక్క బంతికే డక్ఔట్ అయి పెవిలియన్ బాట పట్టాడు.
ఇక.. కేకేఆర్ బౌలర్స్‌లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, అండ్రె రషెల్ 3 వికెట్లు,ఫెర్గుసన్ 2 వికెట్లు, కృష్ణ ఒక వికెట్ తీసి.. బెంగళూరును ఆల్ఔట్ చేశారు.
కేకేఆర్ బౌలర్స్ దాటికి తట్టుకోలేక.. ఆర్సీబీ ప్లేయర్లు చేతులెత్తేయడంతో.. 19 ఓవర్లకే కేకేఆర్.. అందరినీ ఆల్ఔట్ చేసేసింది.
Match 31. 18.6: WICKET! M Siraj (8) is out, c Varun Chakaravarthy b Andre Russell, 92 all out https://t.co/iUcKgUAEzT #KKRvRCB #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) September 20, 2021
Innings Break!
— IndianPremierLeague (@IPL) September 20, 2021
A superb performance from #KKR. From start to finish, they were excellent, with all their bowlers doing a vital job.#RCB are all out for 92 runs with 1 over to spare.
Scorecard – https://t.co/1A9oYR0vsK #KKRvRCB #VIVOIPL pic.twitter.com/LBFbLTkVRf