RCB Playoff Stats| ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గురువారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనున్నది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా జరుగనున్నది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు పంజాబ్‌కు రెండురోజుల విశ్రాంతి దొరికింది. బెంగళూరు జట్టు ఒక రోజు విరామం తర్వాత కీలకమైన మ్యాచ్ ఆడబోతున్నది. అయితే, ఆర్సీబీ జట్టు తమ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో క్వాలిఫయర్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసింది.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు అందరూ ఫామ్‌లో కనిపించారు. ఇదే ఫామ్‌తో క్వాలిఫయర్-1 మ్యాచ్ విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకోవాలని భావిస్తున్నది. అయితే, ప్లేఆఫ్స్‌లో ఆర్సీబీ రికార్డు ప్రత్యేకంగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. అయితే, ఐపీఎల్లో తొలి టైటిల్ కోసం జట్టు నిరీక్షిస్తున్నది. బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు టైటిల్‌ను మాత్రం నెగ్గలేకపోయింది. ఈ సారి మాత్రం జట్టుకు టైటిల్‌ను గెలిచే అవకాశాలున్నాయి. అభిమానులు సైతం అదే కోరుకుంటున్నారు. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్-ఆర్సీబీ మధ్య జరగనున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ముందు ప్లేఆఫ్స్‌లో బెంగళూరు రికార్డు గురించి తెలుసుకుందాం..
బెంగళూరు ఇప్పటి వరకు మొత్తం ప్లేఆఫ్స్‌లో 15 మ్యాచులు ఆడింది. ఈ 15 మ్యాచుల్లో జట్టు పది ఓడిపోయి.. ఐదు మ్యాచుల్లో విజయం సాధించంది. ఆ జట్టు 2011-2016లో రెండుసార్లు క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడింది. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఆర్సీబీ క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్ ఓడించి ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత ఫైనల్లో సీఎస్కే మరోసారి ఆర్సీబీని ఓడించింది. అదే సమయంలో 2016లో ఆర్సీబీ గుజరాత్ లయన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో జట్టు పరాజయం పాలైంది.
ఆర్సీబీ తరఫున ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉన్నది. 15 ఇన్నింగ్స్‌లో 26.23 సగటు 121.78 స్ట్రయిక్ రేట్‌తో 341 పరుగులు చేశాడు. అదే సమయంలో ఏబీ డివిలియర్స్ 268 పరుగులతో రెండోస్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 250 పరుగులతో మూడోస్థానంలో నిలిచాడు. ఇక ఆర్సీబీ తరఫున ప్లేఆఫ్స్‌లో శ్రీనాథ్ అరవింద్ అత్యధిక వికెట్ల తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. ప్లేఆఫ్స్‌లో ఏడు ఇన్నింగ్స్‌లో పది వికెట్ల పడగొట్టాడు. ఆ తర్వాత యుజ్వేంద్ర చాహల్ తొమ్మిది వికెట్లతో రెండోస్థానంలో, మహ్మద్ సిరాజ్ మూడోస్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్ (కెప్టెన్), స్వస్తిక్ చికారా, జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్, మనోజ్ భాండాగే, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, నువాన్ తుషారా, యష్ దయాల్, రిషిక్ దార్ సలామ్, సుయాష్ శర్మ, మోహిత్ రాఠీ, అభినందన్ సింగ్, మయాంక్ అగర్వాల్, బ్లెస్సింగ్ ముజారబానీ, టిమ్ సీఫెర్ట్, లుంగీ ఎంగిడీ.