MIW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ తొలి పోరుకు వేళైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానంలో మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్(Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ తీసుకుంది.
టాస్ పూర్తయ్యాక మాజీ మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు (Harnaz Sandhu) స్టేజిమీదకొచ్చి మహిళా శక్తిని చాటి చెప్పింది. క్రికెట్‌తో పాటు పలు రంగాల్లో అతివల కృషిని ఈ విశ్వ సుందరి కొనియాడింది. అనంతరం బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన బృందంతో కలిసి మెస్మరైజింగ్ డాన్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించింది.
The WPL 2026 opening ceremony kicked off with a performance by former Miss Universe and Indian actress Harnaaz Kaur Sandhu in Mumbai! 😍📸🎶#WPL2026 #NaviMumbai #HarnaazSandhu #Sportskeeda pic.twitter.com/vjxs0XXZ26
— Sportskeeda (@Sportskeeda) January 9, 2026
🚨 Toss 🚨@RCBTweets won the toss against @mipaltan in the season opener and elected to bowl first.
Updates ▶️ https://t.co/IWU1URl1fr#TATAWPL | #KhelEmotionKa | #MIvRCB pic.twitter.com/2pdEsTzdYV
— Women’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
ముంబై ఇండియన్స్ తుది జట్టు : నాట్ సీవర్ బ్రంట్, జి కమలిని(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమన్‌జోత్ కౌర్, నికోలా కారే, పూనమ్ ఖెమ్నర్, షబ్నం ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సంజీవన సంజన, సైకా ఇషాక్.
ఆర్సీబీ తుది జట్టు : స్మృతి మంధాన(కెప్టెన్), గ్రేస్ హ్యారిస్, దయలాన్ హేమలత, రీచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, నడినే డిక్లెర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ప్రేమా రావత్, లిన్సే స్మిత్, లారెన్ బెల్.