IPL 2023 : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు స్పిన్ ఉచ్చులో పడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ల ధాటికి ఒక్కరు కూడా హాఫ్‌స సెంచరీ కొట్టలేకపోయారు. కెప్టెన్ డూప్లెసిస్(44), విరాట్ కోహ్లీ(31) మాత్రమే రాణించారు. దాంతో,ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీకిశుభారంభం ఇచ్చారు. రవి బిష్ణోయ్ ఓవర్లో కోహ్లీ స్టంపౌట్ అయ్యాడు. దాంతో 62 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన అనుజ్ రావత్(9), మ్యాక్స్‌వెల్(4) విఫలయ్యారు. ఆఖర్లో దంచుతాడనుకున్న దినేశ్ కార్తిక్(16) రనౌటయ్యాడు. నవీన్ ఉల్ హక్ వేసిన 20వ ఓవర్లో కరన్ శర్మ(2) క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత సిరాజ్(0) కీపర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, నవీన్ హ్యాట్రిక్‌పై నిలిచాడు. కానీ, హేజిల్‌వుడ్(1) డిఫెండ్ చేశాడు. ఆఖరి బంతికి వనిందు హసరంగ(2) బౌండరీ కొట్టాడు. దాంతో, లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు తీశారు. కృష్ణప్ప గౌతమ్‌కు ఒక వికెట్ దక్కింది.
For his impressive three-wicket haul in Lucknow, Naveen-ul-Haq becomes our 🔝 performer from the first innings of the #LSGvRCB contest in the #TATAIPL 👌🏻👌🏻
A look at his bowling summary 🔽 pic.twitter.com/SvmwgAPaJw
— IndianPremierLeague (@IPL) May 1, 2023