WPL 2024 | గాల్లోకి ఎగిరి సిక్సర్‌ను అడ్డుకుంది.. షాక్ తిన్న ముంబై ఓపెనర్.. వీడియో
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌ను విజయంతో ఆరంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మళ్లీ డీలా పడింది. నివారం చిన్నస్వామి స్టేడియంలో ఆతిథ్య జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్...
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌ను విజయంతో ఆరంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మళ్లీ డీలా పడింది. వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్(Mumbai Indians) చేతిలో పరాజయం పాలైంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో ఆతిథ్య జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్(Shreyanka Patil) తన అద్బుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది.
సోఫీ డెవిన్ వేసిన ఆరో ఓవర్లో ఆఖరి బంతికి ముంబై ఓపెనర్ హేలీ మాథ్యూస్(Healy Mathews) మిడాన్‌లో భారీషాట్ ఆడింది. అందరూ ఆ బంతి సిక్సర్ వెళ్లింది అనుకున్నారు. కానీ, పరుగెత్తుతూ వెళ్లిన శ్రేయాంక సిక్సర్ వెళ్లాల్సిన ఆ బంతిని ఒంటి చేత్తో అడ్డుకుంది. అయితే.. బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడే సమయంలో తెలివిగా బంతిని మైదానంలో పడేసింది. దాంతో, మాథ్యూస్ నమ్మశక్యంకానట్టు షాక్‌లో ఉండిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
#ICYMI: Super Shrey’s super effort last night 👏🦸♀️#PlayBold #SheIsBold #ನಮ್ಮRCB #WPL2024 #RCBvMI
— Royal Challengers Bangalore (@RCBTweets) March 3, 2024
ఆ ఇద్దరి పోరాటంతో..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ జట్టు ఏ దశలోనూ భారీ స్కోర్ దిశగా సాగలేదు. మూడో ఓవర్లోనే డేంజరస్ స్మృతి మంధానా(9)ను ఇసీ వాంగ్ వెనక్కి పంపింది. ఆ తర్వాత వచ్చిన సబ్బినేని మేఘన(11), సోఫీ డెవిన్(9)లను సీవర్ బ్రంట్, ఇషాక్ వెనక్కి పంపారు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని అలీసా పెర్రీ(44), జార్జియా వరేహమ్(27)లు ఆదుకున్నారు.
The Mumbai Indians are back to winning ways! 💙
And with that victory, they move to the 🔝 of the table 👏👏
Scorecard 💻📱https://t.co/VqyJ4Y545d#TATAWPL | #RCBvMI | @mipaltan pic.twitter.com/SuUWM8b89P
— Women’s Premier League (WPL) (@wplt20) March 2, 2024
అనంతరం 132 పరుగుల ఛేదనలో ముంబై ఓపెనర్లు హేలీ మాథ్యూస్(26), యస్తికా భాటియా(31) బౌండరీలతో విరుచుకు పడ్డారు. ఆ తర్వాత కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(27), అమేలియా కేర్(40 నాటౌట్)లు దంచి కొట్టారు. దాంతో, ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొంది మూడో విజయం ఖాతాలో వేసుకుంది.
ఇవి కూడా చదవండి
- Tirumala | తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ?
- Ponnam Prabhakar | ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రవాణా శాఖ మంత్రి
- Minister Komatireddy | పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి : మంత్రి కోమటిరెడ్డి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

