Newzealand Squad : స్వదేశంలో పొట్టి సిరీస్‌కు న్యూజిలాండ్ (Newzealand) జట్టు సమాయత్తమవుతోంది. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది కివీస్. అక్టోబర్ 18 నుంచి సిరీస్ ప్రారంభం కానున్నందున సోమవారం సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. మిచెల్ శాంట్నర్ (Mitchell Santner) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ముఖానికి గాయంతో బాధపడిన ఓపెనర్ రచిన్ రవీంద్ర కోలుకోవడంతో అతడికి చోటు దక్కింది. అయితే.. గాయం కారణంగా పేసర్ లాకీ ఫెర్గూసన్ అందుబాటులో లేడు.
పొట్టి సిరీస్ స్క్వాడ్‌లో ఉండాల్సిన పలువురు స్టార్లకు గాయం కారణంగా చోటు దక్కలేదు. ఫిన్ అలెన్‌కు పాదం గాయంతో బాధ పడుతుండగా.. పేసర్ విలో ఓ రూర్కీ వెన్ను నొప్పితో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆడమ్ మిల్నే మోకాలి గాయంతో, ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గజ్జల్లో ఇబ్బంది కారణంగా ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యారు. గతవారం నెట్స్‌లో ఎడమ కాలి కండరాల గాయం అయినందున సీయర్స్ సెలెక్షన్స్‌కు అందుబాటులో లేడు. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్స్‌ను టీ20లకు తీసుకోలేదు. కానీ, అతడు వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతాడని సమాచారం. అక్టోబర్ 18న క్రిస్ట్‌చర్చ్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది.
ICYMI: Mitchell Santner and Rachin Ravindra return from injury for New Zealand’s T20I series against England, but Kane Williamson misses out with a ‘minor medical issue’ 🇳🇿 pic.twitter.com/UyhyqDWWBE
— ESPNcricinfo (@ESPNcricinfo) October 13, 2025
న్యూజిలాండ్ స్క్వాడ్ : మిచెల్ శాంట్నర్(కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రాస్‌వెల్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, జాకబ్ డఫ్ఫీ, జాక్ ఫౌల్కేస్, మ్యాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్,టిమ్ రాబిన్సన్.