రవికాంత్ రఫ్ఫాట
పసి ప్రాయం నుంచే బాక్సర్ కావాలని కలలు కన్న ఆ కుర్రాడు.. కఠోర శ్రమ, అంకుఠిత దీక్షతో అనుకున్నది సాధించాడు.
సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): పసి ప్రాయం నుంచే బాక్సర్ కావాలని కలలు కన్న ఆ కుర్రాడు.. కఠోర శ్రమ, అంకుఠిత దీక్షతో అనుకున్నది సాధించాడు. నాన్న అడుగుజాడల్లో మైదానం వైపు నడిచిన ఆ బుడ్డోడు చూస్తుండగానే జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టే సత్తా సమకూర్చుకున్నాడు. 13 ఏండ్ల ప్రాయంలోనే రింగ్‌లో అడుగుపెట్టి తన పంచ్‌లతో ప్రత్యర్థులను ముచ్చమటలు పట్టించిన ఆ యువ బాక్సరే రసూల్పూరకు చెందిన కట్టెలమండి రవికాంత్. జాతీయ స్థాయిలో ఏడు స్వర్ణ పతకాలతో సహా లెక్కకు మిక్కిలి అవార్డులు అందుకున్న రవికాంత్.. గత ప్రభుత్వం నిర్వహించిన స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. మరి కొన్ని రోజుల్లో శిక్షణకు వెళ్లనున్న రవికాంత్.. భవిష్యత్తులో జాతీయ స్థాయి బాక్సర్ కావాలనేదే తన కోరిక అంటున్నాడు. సబ్ జూనియర్, జూనియర్, అండర్-17, సీనియర్ ఇలా బరిలోకి దిగిన ప్రతి విభాగంలోనూ ప్రతిభ చాటిన రవికాంత్.. రూరల్ గేమ్స్ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లోనూ పతకంతో మెరిశాడు.
మా నాన్న ధన్‌రాజ్ హాకీ ప్లేయర్. దీంతో చిన్నప్పటి నుంచే ఆటలతో పరిచయం ఏర్పడింది. చిన్నప్పుడు నాన్నతో కలిసి గ్రౌండ్‌కు వెళ్లినప్పుడు అక్కడ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసేవాడిని. అలా దానిపై ఇష్టం పెంచుకున్నా. ఏడో తరగతి నుంచి శిక్షణ తీసుకున్నా. కోచ్ బొబ్బిలి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాటుదేలి అనేక టోర్నీల్లో పాల్గొని సత్తాచాటా. ప్రస్తుతం పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యా. ఇక్కడితో ఆగిపోవాలని అనుకోవడం లేదు. భవిష్యత్తులో బాక్సింగ్ రింగ్‌లో మరింత రాణించడంతో పాటు.. ఆఫీసర్ స్థాయి ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. -రవికాంత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

