Ravichandran Ashwin : బోర్డర్ – గవాస్కర్ తొలి టెస్టులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో పలు ఘనతలు సాధించాడు. రెండో ఇన్నింగ్స్లో అతను ఒకే సెషన్లో 5 వికెట్లు తీశాడు. దాంతో ఈ స్పిన్ మాంత్రికుడు పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. అతను టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 31వ సారి. స్వదేశంలో అయితే 25 సార్లు ఈ ఫీట్ సాధించాడు. స్వదేశంలో ఈ ఫార్మాట్లో ఎక్కువ సార్లు ఈ ఘనత సాధించిన రెండో బౌలరగా అశ్విన్ రికార్డు క్రికేట్ చేశాడు.
భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 35 సార్లు ఐదు వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ టెస్టులో అశ్విన్ 450 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో అలెక్స్ క్యారీని ఔట్ చేసి అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఇండియా ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో గెలిచింది. నాలుగు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టెస్టుల్లో అత్యధికంగా 5 వికెట్ల ప్రదర్శన చేసింది ఎవరంటే.. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. అతను 67 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ (37 సార్లు), న్యూజిలాండ్ బౌలర్ హ్యాడ్లీ (36) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 35 సార్లు 5 వికెట్ల ప్రదర్శనతో నాలుగో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగన హెరాత్ (34) ఐదో స్థానంలో, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (32) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 31 సార్లు 5 వికెట్లతో అశ్విన్ ఏడో స్థానంలో నిలిచాడు.