Ravichandran Ashwin | భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వినాయక చవితి రోజున బుధవారం (ఆగస్టు 27, 2025) సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు.
ప్రతి ముగింపుకి ఒక కొత్త ఆరంభం ఉంటుందని పెద్దలు అంటారు. ఐపీఎల్ క్రికెటర్‌గా నా ప్రయాణం ఈ రోజుతో ముగుస్తోంది, కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లలో ఆటను అన్వేషించే నా సమయం ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఇన్నేళ్ల పాటు నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను, అనుబంధాలను ఇచ్చిన అన్ని ఫ్రాంచైజీలకు, ముఖ్యంగా ఐపీఎల్, బీసీసీఐకి నా కృతజ్ఞతలు. ముందున్న నా ప్రయాణాన్ని ఆస్వాదించడానికి, సద్వినియోగం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాను. అంటూ అశ్విన్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడాలని అశ్విన్ భావిస్తున్నాడు. అతడి పోస్ట్ ద్వారా తెలుస్తుంది.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఐపీఎల్లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 187 వికెట్లు పడగొట్టాడు. ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అశ్విన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ సీజన్లో అతను 9 మ్యాచ్‌లలో కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు.
Special day and hence a special beginning.
They say every ending will have a new start, my time as an IPL cricketer comes to a close today, but my time as an explorer of the game around various leagues begins today🤓.
Would like to thank all the franchisees for all the…
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 27, 2025