ముంబై: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ నిర్ణయం కోట్లాది అభిమానులందరి మాదిరిగానే తననూ షాక్‌కు గురిచేసిందని భారత క్రికెట్ జట్టు మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘కోహ్లీ ఉన్నఫళంగా టెస్టులకు రిటైర్మెంట్ పలకడం నన్ను ఒకరకంగా బాధించింది.
అతడు ఈ ఫార్మాట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. దూకుడైన ఆటతీరుతో టెస్టులను ఆసక్తికరంగా మార్చాడు. అతడి రిటైర్మెంట్ విషయంలో బోర్డు (బీసీసీఐ) సరిగ్గా వ్యవహరించాల్సింది. కానీ అలా జరుగలేదు. ఒకవేళ నాకు అవకాశమిస్తే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నుంచి వచ్చిన వెంటనే కోహ్లీని కెప్టెన్ చేసేవాణ్ని’ అని అన్నాడు.