ప్రస్తుత టీ20 క్రికెట్లో బెస్ట్ ఆటగాళ్ల పేర్లు చెప్పాలంటే కచ్చితంగా ఆఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరు ఆ జాబితాలో ఉండాల్సిందే. అతను లేకుండా ఈ జాబితా పూర్తవదు. అంతర్జాతీయ స్థాయిలో ఆఫ్ఘన్ జట్టుతోపాటు బిగ్‌బాష్ లీగ్, ఐపీఎల్, పీఎస్ఎల్ తదితర టీ20 లీగుల్లో కూడా సత్తా చాటుతున్నాడీ లెగ్ స్పిన్నర్.
తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో రషీద్ ఖాన్ కొట్టిన ఒక భారీ సిక్సర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ టోన్నీలో లాహోర్ కలందర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్.. సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షహ్నవాజ్ దహానీ బౌలింగ్ చేస్తున్నాడు.
అప్పుడు క్రీజులో ఉన్న రషీద్ కనీసం బంతిని చూడను కూడా చూడకుండా భారీ సిక్స్ కొట్టాడు. కేవలం 4 బంతుల్లోనే 17 పరుగులు చేసి కలందర్స్ జట్టుకు 206 పరుగుల భారీ స్కోరు అందించాడు.
మహమ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని సుల్తాన్స్ జట్టు కూడా దంచికొట్టడంతో మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. కానీ చివరి ఓవర్లో కలందర్స్ ఓటమిపాలయ్యారు. ఈ జట్టు తరఫున అత్యంత తక్కువ ఎకానమీ నమోదు చేసిన బౌలర్ కూడా రషీద్ ఖానే కావడం గమనార్హం.