IPL 2025 : గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో కోల్‌కతాకు రషీద్ ఖాన్ పెద్ద షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ సునీల్ నరైన్(17) వికెట్ తీసి గుజరాత్‌కు బ్రేకిచ్చాడు. ధాటిగా ఆడుతున్న నరైన్ లెగ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడగా.. రాహుల్ తెవాటియా చక్కని క్యాచ్ పట్టాడు. దాంతో, పవర్ ప్లేలోనే కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం అజింక్యా రహానే(22), వెంకటేశ్ అయ్యార్(1)లు క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు స్కోర్.. 45-2. ఇంకా కోల్‌కతా విజయానికి 84 బంతుల్లో 154 పరుగులు కావాలి.
సొంత మైదానంలో ఛేదనకు దిగిన కోల్‌కతాను సిరాజ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే దెబ్బకొట్టాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న రహ్మనుల్లా గుర్బాజ్(1)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. అయితే.. అజింక్యా రహానే(22), సునీల్ నరైన్(17)లు దూకుడుగా ఆడి స్కోర్ వేగం పెంచారు. ఈ జోడీని విడదీసేందుకు స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు బంతి అందిచిన గిల్ సఫలం అయ్యాడు.