బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో ద హండ్రెడ్ టోర్నమెంట్ జరుగుతోంది. ఆ టోర్నీలో ఆఫ్ఘన్ ప్లేయర్ రషీద్ ఖాన్(Rashid Khan) కొట్టిన సిక్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ లెగ్ స్పిన్నర్ ఇటీవల బ్యాటర్‌గా కూడా రాణిస్తున్నాడు. అయితే ఆగస్టు 12వ తేదీన జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఓ స్టన్నింగ్ సిక్సర్ బాదాడు. ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడుతున్న అతను.. బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ బౌలర్‌కు తన షాట్‌తో చుక్కలు చూపించాడు. కివీస్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో చాలా ఆకట్టుకునే రీతిలో ఓ సిక్సర్ కొట్టాడు.
బంతి వేయడానికి ముందే కుడి వైపు కదిలిన అతను.. సౌథీ వేసిన ఫుల్ లెన్త్ బంతిని ప్యాడ్స్‌పై ఆడాడు. చాలా ఈజీగా ఆ బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఫ్లిక్ షాట్‌తో ఆ రన్స్ స్కోరు చేశాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఆ బంతి ఫ్లాట్ సిక్స్‌గా వెళ్లింది. ద హండ్రెడ్ టోర్నీ నిర్వాహకులు ఆ షాట్‌కు చెందిన వీడియోను షేర్ చేశారు. ఈ మ్యాచ్‌లో రషీద్ 9 బంతుల్లో 16 రన్స్ స్కోర్ చేశాడు. ఓవల్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 180 రన్స్ చేసింది. అయితే ఆ టార్గెట్‌ను మరో రెండు బంతులు మిగిలి ఉండగానే బర్మింగ్‌హామ్ జట్టు అందుకున్నది.
😱 WHAT THE! 😱
Rashid Khan has just played this shot for 6️⃣ runs 🤯#TheHundred pic.twitter.com/YHNuqDW89E
— The Hundred (@thehundred) August 12, 2025