Ranji Trophy : రంజీ సీజన్లో ఢిల్లీ జట్టు రికార్డు సృష్టించింది. హిమ్మత్ సింగ్ కెప్టెన్సీలోని ఢిల్లీ, పటిష్టమైన ముంబై టీమ్‌ను ఓడించింది. 42 ఏళ్ల తర్వాత ముంబై జట్టుపై గెలుపొందింది. 88 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై, ఢిల్లీ చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. అరుణ్‌జైట్లీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అజింక్య రహానే కెప్టెన్సీలోని ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకై కుప్పకూలింది. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ (125) బాది జట్టును ఆదుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై 369 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో దివిజ్ మెహ్రా ఐదు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు. దాంతో, ఆ జట్టు 170 రన్స్‌కే ఆలౌట్ అయింది. రహానే, కొట్యాన్ మాత్రమే అర్థశతకాలతో రాణించారు. 95 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో నాలుగో రోజే ఆట ముగిసింది.
ముంబై జట్టు రంజీ ట్రోఫీని 41 సార్లు గెలుచుకుంది. ఈ టోర్నమెంట్లో తిరుగులేని జట్టుగా పేరుగాంచింది. అలాంటి ముంబైని, ఢిల్లీ మట్టికరిపించింది. ఓపెనర్ విజయ్ శర్మ 49 బంతుల్లో 36, హృతిక్ షోకీన్ 39 బంతుల్లో 36 రన్స్ చేసి జట్టును గెలిపించారు.