ప్రేగ్: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ వేదికగా జరుగుతున్న ప్రేగ్ మాస్టర్స్‌లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తన తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. గురువారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తెల్లపావులతో బరిలోకి దిగిన అతడు.. చెక్ రిపబ్లిక్‌కే చెందిన డేవిడ్ నవారాతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు.
మరో భారత ఆటగాడు అరవింద్ చిదంబరం.. థాయ్ డే వాన్ (చెక్)తో మ్యాచ్‌లో ఓటమి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని డ్రాతో సరిపెట్టుకున్నాడు.