DC vs UPW : ఢిల్లీ క్యాపిటల్స్ కీలక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మేగ్ లానింగ్ (70) బౌల్డ్ అయింది. వరుసగా రెండో అర్ధ శతకం బాదిన ఆమె రాజేశ్వరి గైక్వాడ్ ఓవర్లో తొలి బంతికి ఫోర్ బాదిన లానింగ్ రెండో బంతికి ఔటయ్యింది. ఈ ఓపెనర్ 42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 స్కోర్ చేసింది. యూపీ బౌలర్లపై విరుచుకు పడిన ఆమె 170 స్ట్రయిక్ రేటుతో బ్యాటింగ్ చేసింది. ప్రస్తుతం జెమీమా రోడ్రిగ్స్ (7), అలిసే క్యాప్సే (12) క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 130రన్స్ చేసింది.
మరిజానే కాప్ (16) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (17) ఔట్ అయింది. మెక్‌గ్రాత్ ఓవర్లో షఫాలీ ఇచ్చిన క్యాచ్‌ను కిరణ్ నవ్‌గిరే అందుకుంది. 67 పరుగుల వద్ద ఢిల్లీ మొదటి వికెట్ పడింది.