Rajeev Shukla : క్రీడాకారుల జీవితాలను తెరపై ఆవిష్కరించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే.. వాటి చిత్రీకరణ, క్రీడా సంఘాల అనుమతులు తీసుకోవడం వంటివి మాత్రం సవాల్ విసురుతాయి. కానీ, హాకీ నేపథ్యంలో వచ్చిన ‘చక్ దే ఇండియా’కు ఇలాంటి ఇబ్బందులేవీ ఎదురవలేదట. అందుకు కారణం నేనే అంటున్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla). షూటింగ్ అనుమతుల కోసం చోప్రా తనకు ఫోన్ చేశాడని.. తాను చొరవ తీసుకొని అందర్నీ ఒప్పించానని చెబుతున్నాడు శుక్లా.
‘చక్ దే ఇండియా మంచి సందేశం ఉన్న సినిమా. ఈ చిత్రం మొదలు పెట్టిన తర్వాత యశ్ చోప్రా నాకు ఫోన్ చేశాడు. మహిళల హాకీ టీమ్ తో పాటు జాతీయ స్టేడియాల్లో షూటింగ్కు అనుమతి వచ్చేలా చూడాలని కోరాడు. నేను వాళ్లతో మాట్లాడి అనుమతులు వచ్చేలా చూశాను. అప్పడప్పుడూ నేను స్టేడియానికి వెళ్లి చక్ దే ఇండియా షూటింగ్ కూడా చూశాను. అయితే.. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మాత్రం ఊహించలేదు. నేను చేసిన చిన్న సాయాన్ని యశ్ చోప్రా మరువలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు కోసం ప్రత్యేకంగా ఒక షో వేయించాడు. అంతేకాదు మా అందరికీ మంచి విందు ఏర్పాటు చేశాడు చోప్రా’ అని యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజీవ్ వెల్లడించాడు.
✨@Chitrashirawat takes us behind the scenes of Chak De! India and recalls the magical moment when she first met @iamsrk and how a friendly competition set the tone for their bond! 🏑
What’s your favourite moment from the film? ✨ pic.twitter.com/MuPGsxfXmm
— IMDb India (@IMDb_in) October 2, 2024
మనదేశంలో క్రీడల నేపథ్యంతో వచ్చిన చిత్రాలు చాలానే. తమ ప్రతిభతో యావత్ భారతవానిని గర్వపడేలా చేసిన ఆటగాళ్ల జీవిత చరిత్రలు తెరకెక్కడం.. అభిమానులు నీరాజనాలు పలకడం చూశాం. అలాంటిదే చక్ దే ఇండియా సినిమా. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2007లో విడుదలైంది. భారత హాకీ ఆటగాడు మిర్ నిరంజన్ స్ఫూర్తిగా తీసుకొని రాసుకున్న ఈ కథకు షారుక్ వంద పాళ్లు న్యాయం చేయగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద రూ.101 కోట్లు కొల్లగొట్టిందీ మూవీ. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రాన్ని షిమిత్ అమిన్ దర్శకత్వం వహించారు.