SRH vs RR : ఐపీఎల్ పదిహేడో సీజన్లో మరో నాకౌట్ మ్యాచ్. ఫైనల్ బెర్తును నిర్ణయించే క్వాలిఫయర్ 2కు మరికాసేపట్లో తెరలేవనుంది. క్వాలిఫయర్ 1లో కోల్‌కతా చేతిలో కంగుతిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎలిమినేటర్‌లో ఆర్సీబీపై గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ జట్లు అమీతుమీకి సిద్దమయ్యాయి. చిన్నస్వామి స్టేడియం వేదికైగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన సంజూ శాంసన్(Sanju Samson) బౌలింగ్ తీసుకున్నాడు.
హైదరాబాద్ తుది జట్టు : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, ఎడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కాట్, నటరాజన్.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, టామ్ కొహ్లెర్ కార్డ్‌మన్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రొవ్మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చాహల్.
పదిహేడో సీజన్లో రికార్డు స్కోర్లకు కేరాఫ్ అయిన హైదరాబాద్ క్వాలిఫయర్ 1లో చతికిలబడింది. టాపార్డర్ వైఫల్యంతో భారీ స్కోర్ చేయలేక.. ఆ తర్వాత బౌలర్లు కట్టడి చేయలేకపోవడంతో కోల్‌కతా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆ మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను క్వాలిఫయర్ 2లో చేయొద్దని కమిన్స్ సేన పట్టదలతో ఉంది. మరోవైపు టేబుల్ టాపర్‌గా నిలిచే చాన్స్ కోల్పియన రాజస్థాన్ లీగ్ దశలో వరుసగా 4 పరాజయాల నుంచి తేరుకుంది.
🚨 Toss Update 🚨
Rajasthan Royals elect to bowl against Sunrisers Hyderabad.
Follow the Match ▶️ https://t.co/Oulcd2G2zx#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCall pic.twitter.com/LMIQIBLEyf
— IndianPremierLeague (@IPL) May 24, 2024
అహ్మదాబాద్‌లో ఆల్‌రౌండ్ షోతో ఆర్సీబీ ట్రోఫీ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రధాన పేసర్ బౌల్ట్, అవేశ్ ఖాన్లకు తోడు స్పిన్ ద్వయం అశ్విన్, చాహల్‌లు టాప్ ఫామల్ ఉండడం ఆ జట్టుకు బలం కానుంది. ఈ నలుగురి నుంచే ఆరెంజ్ ఆర్మీ టాపార్డర్‌కు ముప్పు ఎదురవ్వనుంది. పవర్ ప్లేలో గనకు దంచికొడితే రాజస్థాన్ బౌలర్లపై పైచేయి సాధించొచ్చు. మరి ఈ నాకౌట్ మ్యాచ్‌లో హైదరాబాద్ టాప్ గన్స్ పేలుతాయా? లేదా ప్రత్యర్థికి తలొంచుతాయా? అనేది మరికాసేపట్లో తేలిపోనుంది.