కువైట్ సిటీ: ఈ ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మరో ఇద్దరు షూటర్లు అర్హత సాధించారు. రైజా ధిల్లాన్, అనంత్‌జీత్ సింగ్ విశ్వక్రీడల బెర్త్ దక్కించుకున్నారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నీలో సత్తాచాటి రజత పతకాలు సాధించడం ద్వారా ఈ ఇద్దరు ఒలింపిక్స్ అర్హత మార్క్ అందుకున్నారు.
షాట్‌గన్ మహిళల స్కీట్ విభాగంలో రైజా రెండో స్థానంలో నిలువగా.. పురుషుల స్కీట్‌లో అనంత్‌జీత్ తృటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు. దీంతో భారత్ నుంచి విశ్వక్రీడల్లో పాల్గొననున్న షూటర్ల సంఖ్య 19కి చేరింది.