PAKW vs NZW : వన్డే వరల్డ్ కప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ప్రతి మ్యాచ్‌కు అడ్డుపడుతున్న వర్షం ఈసారి న్యూజిలాండ్, పాకిస్థాన్ ఆటకు అంతరాయం కలిగించింది. పాక్ ఇన్నింగ్స్ 12.2 ఓవర్ల వద్ద చినుకులు మొదలయ్యాయి. దాంతో, అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఉన్న సిద్రా అమిన్ కావడంతో అప్పటికీ పాక్ స్కోర్.. 52/3. అలియా రియాజ్ 11 పరుగులతో క్రీజులో ఉంది. అయితే.. వాన భారీగా పడకపోవడంతో మ్యాచ్ కొనసాగుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.
శుక్రవారం కూడా శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ సమయంలోనూ 12వ ఓవర్ తర్వాత వాన పడింది. ఏకంగా ఐదు గంటల పాటు తెరిపినివ్వలేదు. రాత్రి 9 గంటల తర్వాత ఓవర్లు కుదించి 20 ఓవర్ల ఆట ఆడించారు. లంక 105 పరుగులే చేయగా.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం సఫారీల లక్ష్యాన్ని 121 ప రుగులుగా నిర్ణయించారు. ఛేదనలో కెప్టెన్ లారా వొల్వార్డ్త్(66 నాటౌట్), తంజిమ్ బ్రిట్స్(55 నాటౌట్) వీరబాదుడు బాది జట్టుకు పది వికెట్ల విజయాన్ని కట్టబెట్టారు.