Asia Cup 2023 | భారత్, శ్రీలంక ఫైనల్ ఫైట్‌కు వాన గండం.. రిజర్వ్ డేకు చాన్స్..!
Asia Cup 2023 : ఆసియా కప్(Asia Cup 2023) ఫైనల్ ఫైట్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. దాంతో, భారత్(Team India), డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక(Srilanka) జట్లు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం(R Premadasa Stadium)లో రేపు ఇరుజట్ల మధ్య టైటిల్ పోరు హోరాహోరీగా జరుగనుంది. అయితే.. ఇప్పుడు అభిమానులతో పాటు ఇరుజట్ల ఆటగాళ్ల టెన్షనంతా వర్షం...
Asia Cup 2023 : ఆసియా కప్(Asia Cup 2023) ఫైనల్ ఫైట్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. దాంతో, భారత్(Team India), డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక(Srilanka) జట్లు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం(R Premadasa Stadium)లో రేపు ఇరుజట్ల మధ్య టైటిల్ పోరు హోరాహోరీగా జరుగనుంది. అయితే.. ఇప్పుడు అభిమానులతో పాటు ఇరుజట్ల ఆటగాళ్ల టెన్షనంతా వర్షం గురించే. ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లతో పాటు సూపర్ 4 మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన వరుణుడు ఫైనల్‌ను వదిలేలా లేడు.
అవును.. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు వాన గండం ఉన్నట్లు కొలంబో వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాంతో, మ్యాచ్ వర్షార్ఫణం అవుతుందా? రిజర్డ్ డే(Reserve Day) కేటాయిస్తారా? అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే.. ఆదివారం(సెప్టెంబర్ 17న) వర్షం పడితే కనీసం 20 ఓవర్లు అయినా ఆడిసార్తు. ఒకవేళ అదీ సాధ్యం రిజర్వ్ డే(సెప్టెంబర్ 18)న యథావిధిగా మ్యాచ్ జరుగుతుంది. దురదృష్టం కొద్దీ ఆరోజు కూడా వరుణుడు అడ్డుపడితే ఇరుజట్లను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.
అతడి నుంచే ముప్పు
ఫైనల్లో ఇరుజట్లకు ఎడమచేతి స్పిన్నర్లు(Left Arm Spinners) కీలకంగా మారనున్నారు. ముఖ్యంగా లంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే(Dunith Wellalage) రూపంలో భారత్‌కు ప్రమాదం పొంచి ఉంది. ప్రేమదాస స్టేడియంలో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో ఈ యంగ్‌స్టర్ ఇండియా టాపార్డర్‌ను కూల్చాడు. అయితే.. అదే గేమ్‌లో కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) కూడా ఏం తీసిపోలేదు. నాలుగు కీలక వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు.
కుల్దీప్ యాదవ్, దునిత్ వెల్లలాగే

ప్రపంచ కప్ ముందు జరుగుతున్న మెగా టోర్నీ కావడంతో ఆసియా కప్‌ను భారత జట్టు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంచనాలను అందుకుంటూ సూపర్ 4లో దాయాది పాకిస్థాన్, మాజీ చాంపియన్ లంకను చిత్తు చేసింది. మరోవైపు దసున్ శనక సేన కూడా పాక్‌పై అద్వితీయ విజయంతో టైటిల్ వేటకు సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య ఇది ఎనిమిదో ఆసియా కప్ ఫైనల్.
టీమిండియాదే పై చేయి
అయితే.. గత రికార్డులు పరిశీలిస్తే టీమిండియాదే పై చేయిగా ఉంది. ఏడుసార్లు ఎదురుపడగా భారత్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. లంకను రెండు సార్లు మాత్రమే విజయం వరించింది. ఇప్పటివరకూ 11సార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన ఇండియా ఏకంగా 7 పర్యాయాలు ట్రోఫీని అందుకుంది. మరోవైపు 13 ఫైనల్స్ ఆడిన లంక 6 సార్లు మాత్రమే చాంపియన్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి
Australians Missing Century | ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్.. ఆ నలుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎవరంటే..?
Travis Head | చేయి విరగ్గొట్టుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్.. వరల్డ్ కప్‌లో ఆడేనా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

