IND A vs AUS A : స్వదేశంలో వెస్టిండీస్ సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్(176 నాటౌట్), సాయి సుదర్శన్(100) శతకాలతో చెలరేగారు. ఆస్ట్రేలియా ఏ బౌలర్లపై విరుచుకుపడిన ఈ ఇద్దరూ భారత ఏ జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆసీస్ నిర్దేశించిన 412 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు వికెట్లు ఉండగానే ఛేదించింది. తొలి టెస్టు డ్రాగా ముగిసినా.. రెండో టెస్టులో భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో సమిష్టి వైఫల్యంతో 194కే కుప్పకూలిన భారత ఏ జట్టు అనూహ్య పోరాటంతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. సాయి సుదర్శన్ మినహా ఏ ఒక్కరూ రాణించకపోవడంతో భారీ ఆధిక్యం సాధించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్, యశ్ ఠాకూర్ల విజృంభణతో 185కే ఆలౌటయ్యింది. అనంతరం 412 పరుగుల ఛేదనకు దిగిన భారత జట్టు 85 వద్ద ఓపెనర్ జగదీశన్ (36) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్(100), కేఎల్ రాహుల్(176 నాటౌట్) జతగా ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఏ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
WINNERS 🏆
Congratulations to India A on winning the Two-match multi-day series 1-0 against Australia A 👏
It was a magnificent chase of 412 in the 2nd match led by KL Rahul (176*), Sai Sudharsan (100) and Dhruv Jurel (56)
Scorecard ➡️ https://t.co/3LqlO5GwD4#INDAvAUSA pic.twitter.com/zZjjySNP1D
— BCCI (@BCCI) September 26, 2025
మూడో రోజు 74 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రాహుల్.. నాలుగో రోజు నైట్ వాచ్‌మన్ మానవ్ సుతార్(5) వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చాడు. సాయి సుదర్శన్‌తో కలిసి రాహుల్ 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ తర్వాత సుదర్శన్ వెనుదిరిగినా ఈ డాషింగ్ బ్యాటర్ మాత్రం జట్టును గెలిపించాలనే కసితో ఆడాడు. కెప్టెన్ ధ్రువ్ జురెల్(56)తో పాటు కంగారు యువ బౌలర్లను ఓ ఆట ఆడుకున్న రాహుల్ ఐదో వికెట్‌కు 19 ఓవరల్లో 115 పరుగులు రాబట్టాడు. జురెల్ ఔటైనా నితీశ్ రెడ్డి(16 నాటౌట్) సాయంతో జట్టును గెలిపించాడు రాహుల్. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ మూడు, కొరే రోచిసిలి రెండు వికెట్లతో రాణించారు.