IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్‌పై కన్నేసింది. కానీ, గుజరాత్ బౌలర్లు పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బంతులు సంధించడంతో.. స్కోర్ 50 కూడా దాటలేదు. 5 పరుగులకే డూప్లెసిస్ ఔటైనా .. ఓపెనర్ కేఎల్ రాహుల్(36) ధాటిగా ఆడుతున్నాడు. తనమార్క్ షాట్లతో అలరించిన రాహుల్ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో దడ పుట్టించాడు. మరో ఎండ్‌లో అభిషేక్ పొరెల్ (1) క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు ఢిల్లీ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది.
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు ఆదిలోనే షాక్. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని అర్షద్ ఖాన్ దెబ్బకొట్టాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్ (5) ఔటయ్యాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో బంతిని మిడిల్ చేయలేక వెనుదిరిగాడు. దాంతో, 16 పరుగుల వద్ద ఢిల్లీ వికెట్ పడింది.
#GT get a breakthrough… but KL Rahul keeps the heat 🔛
A gripping powerplay with both teams punching hard 👊#DC are 45/1 after 6 overs.
Updates ▶ https://t.co/4flJtatmxc #TATAIPL | #DCvGT | @DelhiCapitals | @gujarat_titans pic.twitter.com/IxL8KW6Kfk
— IndianPremierLeague (@IPL) May 18, 2025