టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం నుంచి కోలుకుంటున్నాడు. వెన్నెముక గాయంతో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ..బుధవారం కొద్దిసేపు ప్రాక్టీస్ చేశాడు. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ త్రోడౌన్స్ వేయగా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ మూడో రోజు ఆట విరామ సమయంలో ద్రవిడ్‌తో పాటు బౌలర్లు బంతులేయగా కోహ్లీ ప్రాక్టీస్ కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో విజృంభించిన శార్దూల్ ఠాకూర్‌తో కలిసి కొద్దిసేపు ముచ్చటించాడు. ఫిట్నెస్ విషయంలో సీరియస్‌గా ఉండే కోహ్లీ చాలా రోజుల తర్వాత గాయం కారణంగా..మ్యాచ్‌కు దూరమయ్యాడు.