జైపూర్: రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ యేటి ఐపీఎల్ సీజన్ ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో.. అతను ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నాడు. అయితే ఎడమ కాలుకు .. మెడికల్ వాకింగ్ బూట్ వేసుకుని అతను గ్రౌండ్‌కు వచ్చాడు. జైపూర్‌లో జరుగుతున్న ట్రైనింగ్ క్యాంపుకు.. వాకింగ్ బూట్తోనే వచ్చాడు. వారం క్రితం బెంగుళూరులో క్లబ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో రాహుల్ ద్రావిడ్ గాయపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ రాహుల్ ద్రావిడ్‌కు చెందిన వీడియోను పోస్టు చేసింది. ద్రావిడ్ త్వరగా కోలుకుంటున్నట్లు ఆ పోస్టులో చెప్పారు.
ఎడమ కాలుకు వాకింగ్ బూట్ ఉన్నా.. ద్రావిడ్ మాత్రం చురుకుగా ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నాడు. ఆ జట్టు క్రికెటర్లతో హ్యాండ్ షేక్ చేశౄడు. కొందరు ఆటగాళ్లతో డిస్కషన్ చేశాడు. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్‌తో ముచ్చటించాడు. బుధవారం జరిగిన శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిగా వీక్షించాడు ద్రావిడ్. సోషల్ మీడియా యూజర్లు ద్రావిడ్ కమిట్మెంట్ను మెచ్చుకున్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్ కోచ్ ద్రావిడ్.. ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన కేఎస్‌సీఏ గ్రూప్ 1 విజిన్ లీగ్ మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతని కుమారుడు అన్వయ్‌తో కలిసి అతను ఫీల్డ్‌లోకి దిగాడు. విజయ క్రికెట్ క్లబ్ తరపున అతను 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ద్రావిడ్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 8 బంతుల్లో 10 రన్స్ చేశాడు. ద్రావిడ్, అన్వయ్ అయిదో వికెట్‌కు 17 రన్స్ జోడించారు. ఆ తర్వాత మరో సారి రెండవ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ద్రావిడ్ గాయపడ్డాడు. కుమారుడు అన్వయ్‌తో కలిసి క్రీజ్‌లో ఉన్నప్పుడే ద్రావిడ్ కాలికి గాయమైంది.
💗➡️🏡 pic.twitter.com/kdmckJn4bz
— Rajasthan Royals (@rajasthanroyals) March 13, 2025