AFG vs BAN | చటోగ్రామ్: ఓపెనర్లు రహ్మానుల్లా (145), జద్రాన్ (100) సెంచరీలతో కదంతొక్కడంతో బంగ్లాదేశ్తో రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ విజయ దుందుభి మోగించింది. శనివారం జరిగిన పోరులో 142 పరుగుల తేడాతో నెగ్గిన అఫ్గాన్.. మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. మొదట నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గాన్ 9 వికెట్లకు 331 పరుగులు చేసింది.