న్యూఢిల్లీ: ఈ ఏడాది గ్రాండ్ స్లామ్ సీజన్ ప్రారంభ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ సొంతం చేసుకున్నాడు. ఇవాళ జరిగిన సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో డెనిల్ మెద్వెదేవ్‌ను 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో విజయం సాధించాడు. దాంతో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ ఫైనల్లో ఆడటం ఇది ఆరోసారి.
శుక్రవారం జరిగిన సింగిల్స్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మెటియో బెనెరెట్టినిపై విజంయ సాధించి నాదల్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మెద్వెదేవ్ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో సిట్సిపాస్‌పై గెలిచి ఫైనల్‌కు వచ్చాడు. ఫైనల్ మ్యాచ్‌లో నెగ్గి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించడం ద్వారా అత్యంత అరుదైన అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రికార్డు నాదల్ సొంతమైంది. దాంతో టెన్నిస్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.
ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచిన స్పెయిన్ బుల్ నాదల్ ప్రస్తుతం ఇతర టెన్నిస్ దిగ్గజాలైన నొవాక్ జకోవిక్, రోజర్ ఫెదరర్‌తో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇవాళ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కూడా ఆయన ఖాతాలో చేరింది. దాంతో టెన్నిస్ చరిత్రలో 21 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ఆటగాడిగా రఫేల్ నాదల్ చరిత్ర సృష్టించాడు.