Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో దక్షిణాఫ్రికా (South Africa) స్టార్ ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడ (Kagiso Rabada) సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంతులపరంగా అత్యంత వేగంగా 350 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేప్‌టౌన్ (Capetown) లోని న్యూలాండ్స్ వేదికగా ఆస్ట్రేలియా (Australia) తో జరుగుతున్న మూడో టెస్టు ఐదో రోజు ఆటలో రబాడా ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
Kagiso Rabada : టెస్ట్ క్రికెట్లో దక్షిణాఫ్రికా (South Africa) స్టార్ ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడ (Kagiso Rabada) సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంతులపరంగా అత్యంత వేగంగా 350 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేప్‌టౌన్ (Capetown) లోని న్యూలాండ్స్ వేదికగా ఆస్ట్రేలియా (Australia) తో జరుగుతున్న మూడో టెస్టు ఐదో రోజు ఆటలో రబాడా ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్‌లో 288 పరుగుల లక్ష్య ఛేదనకు ఆస్ట్రేలియా బరిలో దిగగా, ఈ ఇన్నింగ్స్‌లోనే రబాడా ఈ ఘనత సాధించాడు.
ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా రబాడా తన 350వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించడానికి రబాడాకు కేవలం 13,808 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికాకే చెందిన మరో దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ (14,719 బంతులు) పేరిట ఉండేది. ఇప్పుడు రబాడా తన సహచరుడిని అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ (14,905 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు.
ఇక ఆడిన మ్యాచ్లపరంగా చూసినా రబాడా అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతను తన 75వ టెస్టు మ్యాచ్‌లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లలో అత్యంత వేగంగా 350 వికెట్లు తీసిన వారిలో వెస్టిండీస్ లెజెండ్ మాల్కం మార్షల్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ దిగ్గజం రిచర్డ్ హ్యాడ్లీ, డేల్ స్టెయిన్ (69 టెస్టులు) అగ్రస్థానంలో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

