IPL 2024 GT vs PBKS : సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్. పంబాబ్ కింగ్స్ పేసర్ రబాడ తన తొలి ఓవర్లోనే వికెట్ తీశాడు. డేంజరస్ వృద్ధిమాన్ సాహా(11)ను ఔట్ చేశాడు. బౌండరీతో జోరుమీదున్న సాహా ఎక్స్ట్రా కవర్స్‌లో ధావన్ చేతికి చిక్కాడు. దాంతో, 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ శుభ్‌మన్ గిల్(19), కేన్ విలియమ్సన్(16)లు ఆడతున్నారు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోర్.. 52/1.
A leading edge leads to a successful catch ✅
Kagiso Rabada with the early inroads for @PunjabKingsIPL 🙌#GT 35/1 after 4 overs#TATAIPL | #GTvPBKS pic.twitter.com/WtuIzzkdMg
— IndianPremierLeague (@IPL) April 4, 2024
అహ్మాదాబాద్‌లో జరుగుతున్న 17వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఒక మార్పుతో ఆడుతోంది. గాయపడిన మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్ జట్టులోకి వచ్చాడు. పంజాగ్ జట్టులో లివింగ్‌స్టోన్ స్థానంలో సికిందర్ రజా ఆడుతున్నాడు.