R Praggnanandhaa | ప్రజ్ఞానందకు కెరీర్ అత్యుత్తమ రేటింగ్స్.. ర్యాంక్ ఎంతో తెలుసా..?
R Praggnanandhaa : భారత గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద(R Praggnanandhaa)) ఫిడే చెస్ ప్రపంచ కప్(FIDE World Cup) ఫైనల్లో అద్వితీయ పోరాటంతో ఆకట్టుకున్నాడు. టై బ్రేక్‌లో ఓడినప్పటికీ కోట్లాది మంది మనసు గెలుచుకున్నాడు. రన్నరప్‌గా నిలిచిన ఈ యువ సంచలనం కెరీర్లోనే అత్యధిక రేటింగ్స్ సాధించాడు. ఫిడే వరల్డ్ కప్‌లో అదరగొట్టిన....
R Praggnanandhaa : భారత గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద(R Praggnanandhaa)) ఫిడే చెస్ ప్రపంచ కప్(FIDE World Cup) ఫైనల్లో అద్వితీయ పోరాటంతో ఆకట్టుకున్నాడు. టై బ్రేక్‌లో ఓడినప్పటికీ కోట్లాది మంది మనసు గెలుచుకున్నాడు. రన్నరప్‌గా నిలిచిన ఈ యువ సంచలనం కెరీర్లోనే అత్యధిక రేటింగ్స్ సాధించాడు. వరల్డ్ కప్‌లో అదరగొట్టిన ప్రజ్ఞానంద 2727.2 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు లైవ్ రేటింగ్స్‌లో టాప్ 20 ర్యాంక్‌లో నిలిచాడు.
ప్రజ్ఞానందతో పాటు మరో ఇద్దరు భారతీయులు టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ డి(Gukesh D) 8వ స్థానంలో, విశ్వనాథన్ ఆనంద్(Vishwanathan Anand) తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో వరల్డ్ చాంపియన్, వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్(Magnus Carlsen) 2838.8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మాగ్నస్ కార్ల్సన్, ప్రజ్ఞానంద

అజర్బైజాన్లో ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో ప్రజ్ఞానంద పోరాడి ఓడిపోయాడు. టై బ్రేక్(Tie Break)లో కార్ల్సన్ విజయం సాధించి కెరీర్లో మొదటి ఫిడే వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. మూడు రోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద అసమాన పోరాటంతో ఆకట్టుకున్నాడు. కార్ల్సన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అతడికి చెమటలు పట్టించాడు. గతంలో కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద ఈసారి మాత్రం అదే ఫలితం సాధించలేకపోయాడు. దాంతో, చరిత్రకు ఒక్క అడుగు దూరంలో నిలిచినా అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.ఈ టోర్నీలో అద్భుతంగా ఆడిన అతను వచ్చే ఏడాది జరుగబోయే క్యాండిడేట్స్ టోర్నమెంట్(Candidates Tournament 2024)కు అర్హత సాధించాడు.
ఇవి కూడా చదవండి
Big Bash League 2023 | ఆసీస్ మాజీ కెప్టెన్ కొత్త అవతారం.. అసిస్టెంట్ కోచ్‌గా మెప్పిస్తాడా..?
US Open 2023 | యూఎస్ ఓపెన్‌లో కొత్త టెక్నాలజీ.. ఆటగాళ్ల ప్రవర్తనను గమనిస్తారిలా..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

